ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. లక్నోలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో ఉన్న నియోనాటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో పదికి పైగా చిన్నారులు సజీవదహనమైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది 6 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.