CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v80), default quality?

భూమిపై ఉన్న ప్లాస్టిక్ చెత్త 2050నాటికి రెండింతలు అవుతుందని నూతన అధ్యయనం వెల్లడించింది. అయితే పునర్వినియోగ ప్లాస్టిక్ ను వినియోగించడం, సమర్థ చెత్త నిర్వహణ వంటి విధానాలను అమలు చేస్తే ఈ ముప్పును 90శాతం తగ్గించొచ్చని తెలిపింది.

త్వరలో ఐరాస ప్లాస్టిక్స్ ఒప్పందంపై భాగస్వామ్య పక్షాలు సంతకాలు చేయనున్న నేపథ్యంలో పరిశోధకులు రూపొందించిన ఈ అధ్యయనాన్ని ‘సైన్స్’ జర్నల్ లో ప్రచురించారు.