localnewsvibe

పొలాస, జగిత్యాల జిల్లా:

ఎవరైతే భక్తితో లలితామాతఅమ్మవారిని కొలుస్తారో వారికి కష్టాలు దూరమవడమే కాకుండా అంతా మంచే జరుగుతుందని 108శ్రీ చక్ర సహిత లలితామాతఆలయ ఫౌండర్ చైర్మన్ చెల్లం స్వరూప సత్తయ్య తెలిపారు.
జగిత్యాల రూరల్ మండలం పొలాస లలితమత ఆలయంలో చెల్లం స్వరూప ఆధ్వర్యంలో శుక్రవారం సుహాసినులు
శ్రీచక్రాలకు కుంకుమ పూజ, అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించి, లలితా సహస్రనామ పారాయణం గావించారు. అనంతరం అమ్మవారికి మహిళలు ఒడిబియ్యం సమర్పించారు.

ఈ సందర్భంగా చెల్లం స్వరూప మాట్లాడుతూ ప్రతి రోజు ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుని నియమ నిష్ఠలు పాటి0చి వారి వారి కార్యాల్లో నిమగ్నమైతే ఆ కుటుంబాన్నీ దేవుడు చల్లగా చూడడమే కాకుండా భాధలనుండి రక్షిస్తాడాని చెప్పారు.

శ్రీచక్రాలకు కేవలం సుహసీనులే కుంకుమ పూజ చేయడం మహిళలు అదృష్టంగా భావించాలన్నారు.

దైవనామస్మరణ,ఆలయ దర్శనం చేయడం వల్ల మనిషికి తెలియని శక్తి వస్తుందని దాంతో ఉత్సాహంగా జీవితాన్ని గడుపవచ్చని ఆలయ ఫౌండరీ చైర్మన్ చెల్లం స్వరూప వివరించారు. భక్తుల లలితమాత పారాయనంతో అలయంతో పాటు చుట్టుపక్కల ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.

ఈ కార్యక్రమంలో పాంపట్టి రవీందర్, మహేందర్, వుటూరి కల్యాణి, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.