🔱 మనిషి మాయలో బ్రతుకుతుంటాడు.

🔱 మానవ జీవితమంతా తమస్సు,
రజస్సు,
సత్వ గుణాలతో నడుస్తుంది.

🔱 వీటి ప్రభావంతో ఏర్పడే
కామ,
క్రోథ,
లోభ,
మోహ,
మద, మత్సరాలనే అరిషడ్వర్గాలు, మనిషి జీవిత గమనాన్ని అడ్డుకుంటుంటాయి.

🔱 వాక్కు అదుపులో ఉన్న మనిషికి సర్వగుణాలు చేతిలో ఉంటాయి.

🔱 కోరికల గుర్రాల్ని అదుపు చేయగల శక్తి అలాంటి వారికి లభిస్తుంది.

🔱 మాట్లాడకుండా, మనసులోని భావాన్ని మాటల ద్వారా వ్యక్తీకరించకుండా ఉండటం మనిషికి చాలా కష్టం.

🔱 సాధన మీదే అది సాధ్యపడుతుంది.

🔱 మనిషి మౌనంగా ఉంటే ఎన్నో సమస్యల్ని నివారించవచ్చు.

🔱 మరెన్నో సమస్యల్ని అధిగమించవచ్చు.

🔱 చేసే పనిపై ఏకాగ్రతను పెంచుకోవచ్చు.

🔱 నేటికీ చాలా మంది భక్తి పరులు, వారం కి ఒకరోజు  ఉపవాసం చేస్తున్నప్పుడు మౌనవ్రతాన్ని అవలంబిస్తుంటారు. ఆరోగ్యపరంగా, మానసిక ప్రశాంతత పరంగా ఎంతో మేలు చేస్తుంది మౌనవ్రతం.

🔱 ఆధ్యాత్మికంగా ఈ వ్రతంతో చేసేవారి వాక్కుకు శక్తి పెరుగుతుంది.

🔱 అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేని కారణంగా వాక్శుద్ధి అవుతుంది.

🔱 ఎంత కోపం వచ్చినా, మౌనవ్రతంలో ఉన్న కారణంగా ఎదుటివారిని తిట్టకుండా తమను తాము నిగ్రహించుకుంటారు.

🔱 తద్వారా మానవ జీవితంలో ప్రధాన శత్రువైన కోపాన్ని అధిగమించినట్టే.

🔱 తుపాకీ గుండు కంటే మాట్లాడే మాట చాలా శక్తి కలిగినది.

🔱 మౌనవ్రతం కారణంగా అనవసర వ్యాగ్యుద్ధాలు,
అశాంతి ఉండవు.

🔱 మాట విలువ తెలిసిన వాళ్లు, దాన్ని తక్కువగా వాడటానికి ఎక్కువ ఇష్టపడతారు.

🔱 వాక్శుద్ధి అనేది చాలా పవిత్రమైంది.

🔱 నోటివెంట తప్పుడు కూతలు రాని వాళ్లకు, ఎప్పుడూ మంత్రసాధన చేసేవారికి ఈ వాక్శుద్ధి ఉంటుంది.

🔱 అలాగే ఎక్కువ మౌనాన్ని ఆశ్రయించే వారికి కూడా వాక్శుద్ధి మెండుగా ఉంటుంది.

🔱 మాటను పొదుపుగా వాడితే, లాభమే తప్ప నష్టం లేదు.

🔱 పరిమితమైన ఉపవాసం పొట్టకు మంచింది.

🔱 పరిమితమైన వాక్కు మనసుకు  మంచిది.