ఓం నమః శివాయ

కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడంతో రథం దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు… శ్రీకృష్ణుడు వెంటనే కర్ణుని బాణంతో చంపమని అర్జునుని ఆదేశించాడు.

భగవంతుని ఆజ్ఞను పాటించిన అర్జునుడు కర్ణుని లక్ష్యంగా చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి బాణాలు ప్రయోగించాడు. కర్ణుడు నేలపై పడిపోయాడు.

మరణానికి ముందు నేలమీద పడిన కర్ణుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు, “నీవేనా ప్రభూ ఇలా చేసింది ? ఇది నీ న్యాయమైన నిర్ణయమేనా! నిరాయుధుడిని చంపమని ఆజ్ఞ ఇచ్చావా

సచ్చిదానందమయుడైన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, “అర్జునుని కొడుకు అభిమన్యుడు కూడా చక్రవ్యూహంలో నిరాయుధుడై ఉన్నాడు, అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపినప్పుడు, అందులో నువ్వు కూడా ఉన్నావు కర్ణా. అప్పుడు నీ జ్ఞానం ఎక్కడ ఉంది, అప్పుడు అభిమన్యుడు నిరాయుధుడుగా ఉన్నాడని ఇది అధర్మం అని ఎప్పుడు అనిపించలేదా కర్ణా, ఇది కర్మ ప్రతిఫలం. ఇదే న్యాయం, అన్నాడు కృష్ణ పరమాత్మ.

ఆలోచనాత్మకంగా పని చేయండి. ఒకరి బలహీనతను ఉపయోగించుకోకండి. అదే కర్మ భవిష్యత్తులో మీ కోసం వేచి ఉంటుంది మరియు అది మీకు దాని ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఏ విత్తు నాటితే ఆ మొక్క మొలుస్తుంది గోడకు కొట్టిన బంతి తిరిగి వచ్చినట్టు. రామాయణ, భారతం మొదలగు ఇతిహాసాలు, చరిత్ర, కథలు, పురాణాలు చూసినా అదే బోధ పడుతుంది.

ఓం నమః శివాయ