శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రబాతాన్ని రచించిన వారు శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ ఆచార్యులు. వీరు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధులైన శ్రీ మనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు.

వీరు క్రీ .శ .1361 లొ జన్మించి 1454 వరకు అంటే 93 సంవత్సరాలు జీవించి ఉన్నారని పరిశోధకుల అభిప్రాయం. వీరు తమ జీవిత కాలంలో అనేక కృతులు రచించారు. వీరి రచనలలో శ్రీ స్వామివారి సుప్రబాతం అనన్య సామాన్యమైన ప్రచారం పొందింది.