ఒక బాగా పేరు ఉన్న వ్యక్తి 300 మంది ఉన్న గదిలో ఉపన్యాసం ఇస్తున్నాడు. తన జేబులో నుంచి ఒక రెండువేల రూపాయల నోట్ ని తీసి ఇది ఎవరికైనా కావాలా అని అడిగాడు. ఆ గదిలో ఉన్న 200 మంది చేతులు గాలిలోకి లేపారు. సరే ఈ రెండువేల రూపాయలని మీలో ఒకరికి తప్పకుండా ఇస్తాను అని ఆ రెండువేల రూపాయలని బాగా మడతలు పడేలా నలిపేసాడు. మరల తను ఇప్పుడు ఇది ఎవరికి కావాలి అని అడిగాడు. మళ్లీ అందరు చేతుల్ని లేపారు. తను మరల ఆ రెండువేల రూపాయలని కింద పడేసి తన కాళ్ళతో తోక్కేసాడు. అప్పుడు ఆ రెండువేల రూపాయలు నోటు బాగా మడతలు పడి, మట్టి కొట్టుకుపోయింది. మరల అతడు దాన్ని తీసి ఇప్పుడు ఇది ఎంతమందికి కావాలి అన్నాడు. ఇప్పుడు కూడా అందరు తమ చేతులు పైకెత్తారు. అప్పుడు అతడు అక్కడ ఉన్న వాళ్ళతో ఇలా చెప్పాడు… నా మిత్రులారా మీరందరూ ఇప్పటి వరకు ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నారు. ఇప్పటి వరకు ఈ రెండువేల రూపాయల్ని ఏమి చేసిన మీరందరూ ఇంకా కావాలి అంటున్నారు. ఎంద…