localnewsvibe

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం
శ్రీరంగ ధామేశ్వరీం

దాసీ భూత సమస్త దేవ వనితాం
లోకైక దీపాంకురాం

శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్
బ్రహ్మేంద్ర గంగాధరాం

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం
వందే ముకుంద ప్రియాం…

తాత్పర్యం :

లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై, దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు.

బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి.

ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు…