ఎన్టీఆర్ జిల్లాలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలింది.

ఈ ఘటనలో 15 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్ జిల్లా,జగ్గయ్యపేట అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్, 9 మందికి తీవ్ర గాయాలు, ఆరుగురు పరిస్థితి విషమం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఫ్యాక్టరీ యాజమాన్యం