తెలంగాణ రాష్ట్రంలోనే పేరొందిన అయ్యప్ప దేవాలయంగా కీర్తింపబడుతున్న పాల్వంచ అయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగి సంవత్సరం అయినా సందర్భంగా మొదటి వార్షికోత్సవ ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు.

సోమవారం దేవాలయంలో ప్రధాన పూజారి మాధవన్ నంబుద్రి, పూజారి బృందావనం నర్సింహమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. గణపతి హోమం, మహాభిషేకం, అలంకరణ వంటి పూజలు చేసారు. ఈ సందర్భంగా భక్తులకు అన్న సంతర్పణ చేశారు.

ఈ ప్రత్యేక పూజల్లో DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని పూజలు చేశారు.

ఈ కార్యక్రమాల్లో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార కమిటీ అధ్యక్షులు రాజ్ దేశ్ పాండే, ఆలయ కమిటీ సభ్యులు కనగాల రాంబాబు, మిరియాల కమలాకర్, శంకర్ మని, వేమా రెడ్డి, ముత్యాల నాగేందర్, BN చారి, NP చారి, రెడ్డి, ప్రసాద్, కందుకూరి రాము, దామెర్ల రాంబాబు, లింగయ్య, రాము, పులి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.