ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: పాల్గుణ
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: తదియ ఉ.09:02 వరకు
తదుపరి చవితి
వారం: బుధవారం – సౌమ్యవాసరే
నక్షత్రం: అశ్విని రా.11:34 వరకు
తదుపరి భరణి
యోగం: ఐంద్ర రా.12:47 వరకు
తదుపరి వైధృతి
కరణం: గరజ ఉ.09:02 వరకు
తదుపరి వణిజ రా.08:01 వరకు
తదుపరి భధ్ర
వర్జ్యం: రా.07:46 – 09:17 వరకు
దుర్ముహూర్తం: ప.12:01 – 12:49
రాహు కాలం: ప.12:25 – 01:55
గుళిక కాలం: ఉ.10:55 – 12:25
యమ గండం: ఉ.07:55 – 09:25
అభిజిత్: 12:01 – 12:49
సూర్యోదయం: 06:25
సూర్యాస్తమయం: 06:25
చంద్రోదయం: ఉ.08:30
చంద్రాస్తమయం: రా.09:35
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: మేషం
దిశ శూల: ఉత్తరం
సౌభాగ్య తృతీయ ( మతాంతరం )
దగ్ధయోగము
వినాయక చతుర్థి
మధూకవ్రతం
తిల చతుర్థి
తిల దానం – హోమ, తిల పూజ – సేవన
శాంత చతుర్థి ( మౌనవ్రతం)
అవిఘ్నగణపతి వ్రతం
శ్రీ వినాయక్ రావుల్ మహారాజ్ జయన్తి
డుంఢిరాజగణపతి పూజ
మిలటూర్ శ్రీ వినాయకర్ రథోత్సవం
పుత్రగణపతి వ్రతం
తేరేజంతూర్ శ్రీ జ్ఞానసంబందర్ రథోత్సవం
నేటి రాశి ఫలాలు
మేషం
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శివారాధన శుభప్రదం.
వృషభం
శారీరకశ్రమ పెరుగుతుంది. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు సొంతం అవుతాయి. బంధువులతో బేధాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శ్రేయస్కరం.
మిధునం
అనుకూల సమయం. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. విష్ణుసహస్రనామ పారాయణ మంచి ఫలితాలను ఇస్తుంది.
కర్కాటకం
శుభ సమయం. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో దైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభప్రదం.
సింహం
అనుకున్నది సాధించేవరకు పట్టుదల తగ్గకుండా చూసుకోవాలి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే పనులను ప్రారంభిస్తే మంచిది. ఇష్టదైవారాధన శుభప్రదం.
కన్య
ప్రారంభించబోయే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. బంధు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. నలుగురికీ ఉపయోగపడే పనులను చేసి తోటి వారి నుంచి ప్రశంసలను అందుకుంటారు. గణపతి మంత్రం చదివితే మంచిది.
తుల
బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. పనులను వాయిదా వేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.
వృశ్చికం
మీ మీ రంగాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. విజయావకాశాలు మెరుగవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
ధనుస్సు
స్థిరమైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. మనఃస్సౌఖ్యం ఉంది. ఆర్థికంగా శుభకాలం. గాయత్రీ మంత్రాన్ని జపించాలి.
మకరం
ఆశించిన ఫలితాలను రాబట్టడానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. సమయపాలన పాటించండి. బలమైన ఆహారంతో పాటు విశ్రాంతి అవసరం అవుతాయి. ప్రయాణాలలో ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీరామ నామాన్ని జపించండి.
కుంభం
తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. ధనలాభం ఉంది. శత్రువులు తగ్గుతారు. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిరచిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. ప్రయాణ అనుకూలత ఉంది. కులదైవారాధన శుభప్రదం.
మీనం
తోటివారి ఆదరాభిమానాలు ఉంటాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. దుర్గా అష్టోత్తరం చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)