localnewsvibe

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

నేటి పంచాంగం

విక్రమ సంవత్సరం: 2080 నల

శక సంవత్సరం: 1945 శోభకృత్

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: శిశిర

మాసం: ఫాల్గుణ

పక్షం: శుక్ల – శుద్ధ

తిథి: నవమి రా.02:41 వరకు
తదుపరి దశమి

వారం: సోమవారం – ఇందువాసరే

నక్షత్రం: ఆర్ద్ర రా.10:03 వరకు
తదుపరి పునర్వసు

యోగం: సౌభాగ్య సా.04:37 వరకు
తదుపరి శోభన

కరణం: బాలవ ప.02:38 వరకు
తదుపరి కౌలువ రా.02:41 వరకు
తదుపరి తైతుల‌

వర్జ్యం: ఉ.పూ.06:04 – 07:42 వరకు

దుర్ముహూర్తం: ప‌.12:48 – 13:36
మరియు ప‌.03:13 – 04:02

రాహు కాలం: ఉ‌.07:52 – 09:23

గుళిక కాలం: ప‌.01:54 – 03:25

యమ గండం: ఉ‌.10:53 – 12:24

అభిజిత్: 12:00 – 12:48

సూర్యోదయం: 06:21

సూర్యాస్తమయం: 06:26

చంద్రోదయం: ప‌.12:43

చంద్రాస్తమయం: రా.01:36

సూర్య సంచార రాశి: మీనం

చంద్ర సంచార రాశి: మిథునం

దిశ శూల: తూర్పు

జ్ఞానదానవమి

సరస్వతి పూజ

ఆనందనవమి

శ్రీ దుర్గా పూజ

చంద్రగుత్తి‌ శ్రీ రేణుకాంబదేవి‌ రథోత్సవం

గణనాథ‌ నాయనార్‌ తిరునక్షత్రం‌

శ్రీవిల్లిపూత్తూర్‌ శ్రీ ఆండల్ చంద్రప్రభ వాహనసేవ రథోత్సవం

లఠ్ఠ్మార్ హోలీ

ఇక్కేరి‌ అఘోరేశ్వర‌ రథోత్సవం

బ్రజ‌ – బర్సానా‌ హోళి ఉత్సవారంభం‌


నేటి రాశి ఫలాలు


మేషం

పట్టుదలతో పనిచేయాలి. అభివృద్ధికై చేసే ప్రతీ ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.

వృషభం

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.

మిధునం

ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తి శ్రద్ధలతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. ధర్మసిద్ధి ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

కర్కాటకం

కొన్ని విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలను, నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

సింహం

మనస్సౌఖ్యం కలదు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం తో చేసే పనులు మంచినిస్తాయి, మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి.

కన్య

బలమైన సంకల్పబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. అభివృద్ధికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.

తుల

మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. సగ్గోష్ఠి, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగటానికి విష్ణుధ్యానం శుభప్రదం.

వృశ్చికం

చేపట్టే పనుల్లో దేహజాఢ్యాన్ని రానీవ్వకండి. విఘ్నాలు ఎదురవుతాయి. చంచల బుద్ధి కాస్త ఇబ్బంది పెడుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.

ధనుస్సు

మీ మీ రంగాల్లో అనుకున్నఫలితాలు సొంతమవుతాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది కనకధారాస్తవం పఠించాలి.

మకరం

మానసికసౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.

కుంభం

ముఖ్య విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. శివనామాన్ని జపించడం ఉత్తమం.

మీనం

మీ కృషి ఫలిస్తుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవ్వరితోనూ వాదోపవాదాలు చేయకండి. లలితా దేవిని స్తుతి చేయాలి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)