యువ హీరోలతో పాటు సీనియర్ హీరోల సినిమాల్లోనూ శ్రీలీల అవకాశాలు దక్కించుకుంటున్నారు.

తాజాగా ఆమెకు తమిళ స్టార్ హీరో అజిత్ తో నటించే ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తోన్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీలో ఆమె హీరోయిన్గా నటించనుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జూన్ లో షూటింగ్ ప్రారంభం కానుంది.