ముంబైలోని సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద శబ్దాలు వస్తున్నాయంటూ పక్కింటి వ్యక్తి ట్వీట్ చేశారు.

‘ఇంటి నిర్మాణ పనులతో వచ్చే శబ్దాలు ఇబ్బందిగా ఉన్నాయి. రాత్రి 9 అయినా ఆగడం లేదు. సమయాన్ని ఫాలో అవ్వమని కార్మికులకు చెప్పండి’ అంటూ దిలీప్ అనే వ్యక్తి పోస్ట్ చేసి సచిన్కు ట్యాగ్ చేశారు. దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సచిన్ ఇంట్లో ‘ఈడీ రైడ్స్ అవుతున్నాయేమో’ అంటూ ఒకరు కామెంట్ చేశారు.