కుల, మత, ఆర్థిక భేదాలు లేకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ… 2047 నాటికి అసమానతలు, పేదరికం కనబడకుండా చేయాలన్నదే మా లక్ష్యం. ఆ ఏడాదికి అభివృద్ధి చెందిన దేశంగా భారతు తీర్చిదిద్దుతాం. ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తిమంతం చేసింది’ అని పేర్కొన్నారు.