TS RTC కొత్త బస్సులతో ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటోంది.

ఈక్రమంలో ఆర్టీసీ నడుపుతోన్న కొత్త ‘రాజధాని’ బస్సులు హైదరాబాద్ రోడ్లపై దర్శనమిస్తున్నాయి. తాజాగా ఎయిర్ పోర్ట్ నుంచి ఆర్మూర్ కు వెళ్తున్న రాజధాని బస్సు వీడియోను సంస్థ ఎండీ సజ్జనార్ ట్విటర్లో షేర్ చేశారు.