పరిధి దాటితే అలవాటు వ్యసనంగా మారుతుంది. నేడు Instagram, Twitter వంటివి అలవాట్లుగా మొదలై వ్యసనాలుగా మారుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

తన భార్య అలా Instagramకు బానిసైందన్న ఆవేదనతో కర్ణాటకలో కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టడం, ఆ కారణంగా ఇద్దరికీ తరచూ గొడవలు అవుతుండటంతో మనస్తాపంతో చెట్టుకు ఉరేసుకున్నట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.