నైటాంక్ ఇండియా తాజాగా విడుదల చేసిన డేటాలో హైదరాబాద్లో రెసిడెన్షియల్ సేల్స్ వృద్ధి గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.

జూన్ 2024లో రూ. 4288కోట్ల విలువైన గృహాలు అమ్ముడైనట్లు నివేదిక ద్వారా వెల్లడైంది. అమ్మకాల పరంగా వార్షిక వృద్ధి 48 శాతం కాగా, నెలవారీ వృద్ధి 14 శాతంగా నమోదైంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఇళ్ల విక్రయాలు భారీగా ఉన్నట్లు సమాచారం.