హిందూపురం పట్టణానికి చెందిన 12 ఏళ్ల రవికుమార్ తన అనర్గళమైన జ్ఞాపకశక్తితో భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700శ్లోకాలు పుస్తకం చూడకుండానే ఉచ్చరిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు.
పట్టణం ధనలక్ష్మీ రోడ్ లో నివాసం ఉన్న ఎన్ఆర్ రాజేశ్, శ్రీలక్ష్మీల కుమారుడు రవికుమార్ స్థానిక వాసవి విన్నర్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. భగవద్గీత శ్లోకాల పోటీల్లో ప్రతిభ చాటి గణపతి సచ్చిదానంద చేతులమీదుగా బంగారు పతకం అందుకున్నాడు.