మహాలక్ష్మి పథకం గేమ్‌ఛేంజర్ గా మారిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. “రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది.
ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారు. జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నాం. సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది”అని అన్నారు.