హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఆదివారం తెల్లవారుజామున ఘోరం అగ్నిప్రమాదం జరిగింది. దాసరి సంజీవయ్య కాలనీలో ఓ ఇంటిలో మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో జలగం సాయి సత్య శ్రీనివాస్(32) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు ఏపీలోని రాజమండ్రికి చెందినవాడని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.