ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన కాంగ్రెస్, BRS, సీపీఐ అభ్యర్థులు ఐదుగురూ ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు.
ఈ నెల 13న ఐదుగురిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తనకు స్థిర, చరాస్తులు కలిపి రూ.115 కోట్లకుపైగా ఉన్నాయని, సొంత కారు లేదని పేర్కొన్నారు.