Category: జాతీయవార్తలు

LICలో వాటాను విక్రయించే యోచనలో ప్రభుత్వం

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ LICలో వాటాను విక్రయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో 2-3 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తోంది. 2027 నాటికి పబ్లిక్ షేర్ హోల్డింగ్ ను 10 శాతానికి చేర్చాలనే ప్రణాళికలో భాగంగా ఈ…

సంచలన నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కార్…

మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరాఠీ భాషను తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు మరాఠీలోనే మాట్లాడాలని.. లేకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల్లో మరాఠీనే మాట్లాడేలా సైన్ బోర్డులు పెట్టాలని,…

కళాశాల మరుగుదొడ్డిలో విద్యార్థిని ప్రసవం… ఎక్కడ…? వివరాల్లోకి వెళ్ళితే…

మరుగుదొడ్డిలో ఓ యువతి… శిశువుకు జన్మనిచ్చి చెత్తకుండీలో పడేసిన సంఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. తంజావూర్ జిల్లా కుంభకోణంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థిని(20) గర్భం దాల్చింది. కళశాలలో ప్రసవ నొప్పులు రావడంతో… మరుగుదొడ్డికెళ్లి ఆడ శిశువుకి జన్మనిచ్చింది. యూట్యూబ్ లో…

పెరిగిన దేశీయ కార్ల విక్రయం

దేశంలో లగ్జరీ కార్ల వినియోగం పెరిగింది. రూ.50లక్షలకు పైబడిన ప్రీమియం మోడళ్ల కార్ల విక్రయం ఈ ఏడాది పెరిగింది. 2024లో గంటకు సగటు 6 కార్లు విక్రయించబడ్డాయి. ఐదేళ్లక్రితం గంటకు రెండు లగ్జరీకార్లు మాత్రమే అమ్మకాలు జరిగేవి. కస్టమర్ల అభిరుచులు మారుతుండడం…

ఆ రైలు రెండు నెలలురద్దు!

దేశం నలుమూలల నుంచి యూపీలోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు భక్తులు పోటెత్తనున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి – హుబ్లీ, హుబ్లీ – తిరుపతి ప్యాసింజర్ రైలును కుంభమేళాకు రెండు నెలల పాటు పంపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే…

RBI పాత 5 రూపాయల నాణేన్ని నిలిపివేయడానికి గల కారణాలు తెలుసా….

ప్రస్తుతం దేశంలో రెండు రకాల ఐదు రూపాయల నాణేలు చెలామణిలో ఉన్నాయి. ఒకటి ఇత్తడితో, మరొకటి మందమైన లోహంతో తయారు చేయబడింది. అయితే, మందమైన నాణెం యొక్క ప్రాబల్యం ఇటీవల తగ్గింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కానీ, భారతీయ రిజర్వ్ బ్యాంక్…

‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ లోక్‌సభలో బిల్లు కు ఓటింగు

జమిలి ఎన్నికలపై లోక్‌సభలో ఓటింగ్ నిర్వహించారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్‌ ముందుకొచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, మరో బిల్లును…

‘గిన్నిస్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా’ గా పేరు పొందిన కేరళలోని కుటుంబం!

కేరళలోని మలప్పురానికి చెందిన కుటుంబసభ్యులు ‘గిన్నిస్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా’గా పేరుపొందారు. చేతులను ఉపయోగించకుండా 8.57 సెకన్లలో అరటిపండు తిని ఆ కుటుంబంలోని అబ్దుల్సలీం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన కుమార్తె జువైరియా తన మోచేతులు, మోకాళ్లపై నడుస్తూ తలపై చేయిని…

గత సంవత్సర కాలంలో ఎన్ని సైబర్ దాడులు జరిగాయో తెలుసా…

దేశంలో 2023 అక్టోబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఏడాది కాలంలో జరిగిన సైబర్ దాడులపై DSCI, సెకైట్ నివేదిక రూపొందించాయి. దేశవ్యాప్తంగా 84లక్షల ఎండ్పాయింట్ల (నేరం జరిగినట్లు గుర్తించిన కేంద్రం)లో 36.9కోట్ల మాల్వేర్లతో దాడులు జరిగినట్లు గుర్తించారు. దీని…

గత నెలలో పెరిగిన వాహన రిటైల్ విక్రయాలు…

వాహన రిటైల్ విక్రయాలు ఈ ఏడాది నవంబరులో 32,08,719కి చేరాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. 2023 ఇదే నెలలో విక్రయమైన 28,85,317 వాహనాలతో పోలిస్తే ఇవి 11.21% ఎక్కువని తెలిపింది. ద్విచక్ర వాహనాల రిటైల్ 2 22,58,970 ,…

HDFC బ్యాంక్ రుణగ్రహీతలకు బిగ్ షాక్… పెరిగిన వడ్డీరెట్లు…

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్ రుణగ్రహీతలకు బిగ్ షాకిచ్చింది. షార్ట్ టర్మ్ టెన్యూర్ లోన్లపై స్వల్పంగా వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఓవర్నైట్ టెన్యూర్ రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బెస్డ్ లెండింగ్ రేటుని 5…

ఈ సంవత్సరంలో విమానాలకు ఎన్ని బాంబు బెదిరింపులు వచ్చాయో తెలుసా…

గడిచిన ఐదేళ్లలో భారత్ లోని విమానయాన సంస్థలకు సంబంధించి 809 నకిలీ బాంబు బెదిరింపు ఘటనలు చోటుచేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఒక్క ఏడాదే 719 బెదిరింపు ఘటనలు నమోదైనట్లు పార్లమెంటుకు తెలిపింది. విమానయాన సంస్థలకు 2020 నుంచి ఇప్పటివరకు మొత్తంగా…

కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి… ఎంతంటే…

అంతర్జాతీయ చమురు ధరల ట్రెండ్‌లకు అనుగుణంగా చేసిన నెలవారీ సవరణలో జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్ ధర ఆదివారం 1.45 శాతం పెరిగింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ ధరలు 19 కిలోల…

అరుదైన రికార్డుక చేరువలో కోహ్లి!

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టు జరిగే అడిలైడ్ ఓవల్ గ్రౌండ్లో విరాట్ కోహ్లి అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ఈ మైదానంలో మరో 102 పరుగులు చేస్తే ఆయన లారా అత్యధిక పరుగుల రికార్డును అధిగమించనున్నారు. ఇప్పటివరకు కోహ్లి ఈ గ్రౌండ్…

CNG ధరల పెంపు… ఎంతంటే…

దేశవ్యాప్తంగా ఢిల్లీ మినహా మిగిలిన నగరాల్లో CNG ధర పెరిగింది. కిలో CNGకి రూ.2 చొప్పున పెంచారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ నగరానికి ఈ పెంపుదల నుంచి మినహాయించినట్లు కనిపిస్తున్నది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ…

పండగ సీజనులో రోజుకు లక్ష వాహనాల విక్రయాలు

ఈ ఏడాది 42 రోజుల పాటు కొనసాగిన దసరా – దీపావళి పండగ సీజనులో వాహనాల రిటైల్ విక్రయాలు 12% పెరిగి 42,88,248 కు చేరినట్లు డీలర్ల సంఘం ఫాడా తెలిపింది. అంటే సగటున రోజుకు ఒక లక్ష వాహనాలు విక్రయమయ్యాయి.…

UP : అగ్ని ప్రమాదంలో చిన్నారుల సజీవదహనం… వివరాల్లోకి వెళ్ళితే…

ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. లక్నోలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో ఉన్న నియోనాటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదికి పైగా చిన్నారులు సజీవదహనమైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది 6 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.…