Category: తెలంగాణ వార్తలు

Hyd : ఘోర రోడ్ ప్రమాదం… ఆర్టీసీ బస్సును ఢీకొని నుజ్జు నుజ్జయిన కారు… వివరాల్లోకి వెళ్ళితే…

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొని కారు నుజ్జు నుజ్జయిన ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం (…

Telangana : ఉపాధ్యాయుల జీవో 317 బదిలీలకు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణలో జీవో 317 కారణంగా నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఊరట లభించనుంది. ఈ జీవో అమలుతో ఇబ్బందిపడిన భార్యాభర్తలు, మ్యూచువల్, అనారోగ్యం కారణాలున్న ఉద్యోగుల బదిలీకి సంబంధించిన దస్త్రంపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసినట్లు తెలుస్తోంది. స్పౌజ్, మ్యూచువల్, హెల్త్గ్రౌండ్స్…

TG : ఇవ్వాళ రాష్ట్రంలో ఈ జిల్లాల్లో వర్షాలు…

రాష్ట్రంలో శని, ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ సూచించింది. శనివారం ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు…

HYD : తెలంగాణ బియ్యం ఫిలిప్పీన్స్ కు ఎగుమతి

తెలంగాణ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తామని ప్రకటించిన రేవంత్ సర్కారు.. ఆ దిశలో తొలి అడుగు వేస్తోంది. ఫిలిప్పీన్స్ కు ముడిబియ్యం ఎగుమతి చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఇటీవల ఫిలిప్పీన్స్ ప్రభుత్వంతో రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…

TG : అరకోటికి పైగా ఇళ్లలో సమగ్ర కుటుంబ సర్వే పూర్తి

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను దేశానికే ఆదర్శమయ్యేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సర్వే జరుగుతున్న తీరుపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్షించారు. శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 44.1 శాతం 51,24,542 ఇళ్లలో సర్వే…

సౌరశక్తి ఉత్పత్తి రంగంలోకి రానున్న హీరో మహేశ్ బాబు

తెలుగు సినీ నటుడు మహేశ్ బాబు సౌరశక్తి ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించనున్నట్లు సమాచారం. ట్రూజన్ సోలార్(సన్జక్ లిమిటెడ్) తో కలిసి సౌరశక్తి వ్యాపార రంగంలోకి ఆయన ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన భారీగా పెట్టుబడులు పెట్టనున్నారని టాక్ నడుస్తోంది. కాగా…

రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ అప్పుడేనా?

తెలంగాణలో వచ్చే సంక్రాంతి నుంచి సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీంతో జనవరి 14, 2025 నుంచి నిరుపేదలు సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇస్తున్న…