హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొని కారు నుజ్జు నుజ్జయిన ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ( డిసెంబర్ 1, 2024 ) కూకట్ పల్లి సమీపంలోని వై జంక్షన్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్సును వెనుక నుండి ఢీకొని కారు నుజ్జు నుజ్జయ్యింది.

ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.