తెలంగాణలో జీవో 317 కారణంగా నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఊరట లభించనుంది.
ఈ జీవో అమలుతో ఇబ్బందిపడిన భార్యాభర్తలు, మ్యూచువల్, అనారోగ్యం కారణాలున్న ఉద్యోగుల బదిలీకి సంబంధించిన దస్త్రంపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసినట్లు తెలుస్తోంది. స్పౌజ్, మ్యూచువల్, హెల్త్గ్రౌండ్స్ వారికి బదిలీలు జరపాలని కొద్దిరోజులక్రితమే సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఆదస్త్రాన్ని సీఎంకు పంపగా… ఆయన ఆమోదించినట్లు సమాచారం. త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉండనుంది.