మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:11 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
తాండూర్: జోనల్ స్థాయి ఉత్తమ క్లబ్ గా తాండూర్ వాసవి క్లబ్ ఎంపికై అవార్డు గెలుచుకున్నది. ఆదివారం రాత్రి మంచిర్యాల కేంద్రంలోని విశ్వనాథ ఆలయం కాలక్షేప మండపంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుల ఆదేశానుసారం జోన్ సోషల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆసిఫాబాద్, తాండూర్, బెల్లంపల్లి, మందమరి, రామకృష్ణాపూర్ క్లబ్ లలో ఉత్తమ క్లబ్ గా తాండూర్ ఎంపికై అవార్డును గెలుచుకున్నది. ఉత్తమ కార్యదర్శిగా తాండూర్ వనిత సింధూర్ క్లబ్ కార్యదర్శి కోడిప్యాక మాదూరి ఎన్నికై అవార్డును అందుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంతర్జాతీయ అధికారి వాసవియన్ కలికోట శ్రీనివాస్, అబ్జర్వర్ గా కొంకుముట్టి వెంకటేశ్వర్లు, గౌరవ అతిథిగా జిల్లా వైస్ గవర్నర్ పుల్లూరి బాల్మోహన్, కార్పొరేట్ వైస్ చైర్మన్ వాసవియన్ గోల్డెన్ స్టార్ కే.సంతోష్ కుమార్, కార్యక్రమ నిర్వాహకురాలు జోన్ చైర్మన్ మేడి లావణ్య, రాము, తాండూర్ వాసవి క్లబ్ అధ్యక్షులు మధుసూదన్, కార్యదర్శి మని కృష్ణ, కోశాధికారి మహేష్, బాపూజీ, చంద్రశేఖర్, గణేష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ….
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
