మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:23 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

ఆసుపత్రి పై అసత్య ప్రచారాలు మానుకోవాలి…

బెల్లంపల్లి: బెల్లంపల్లి బస్తీలోని లిటిల్ స్టార్ ఆసుపత్రిపై కొందరు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు, అసత్య పోస్టులపై స్పందించిన ఆసుపత్రి పిల్లల వైద్యులు ప్రమోద్ కుమార్ శనివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియా వేదికగా బట్వాన్ పల్లి గ్రామానికి చెందిన రత్నం సోమయ్య తమపై చేస్తున్న అసత్య ఆరోపణల విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

రెండు నెలల క్రితం ఆస్పత్రిని సదుద్దేశంతో ప్రారంభించి వైద్య సేవలను అందిస్తుండగా ఈనెల 21వ తేదీన రత్నం సోమయ్య కుమార్తె ఆద్య ను తీవ్రమైన జ్వరంతో తీసుకువొచ్చారని వైద్యంలో భాగంగా రక్త పరీక్షలు నిర్వహించి టైఫాయిడ్ గా నిర్ధారణ కావడంతో వైద్య చికిత్సలను ప్రారంభించి సంబంధిత వైద్యానికి మూడు రోజులు కోర్స్ వాడాల్సి ఉంటుందని సూచించగా, తాము ఇంటి వద్ద ఇంజక్షన్లు వేయించుకుంటామని మందులు మాత్రమే ఇవ్వండని అడుగగా నిరాకరించామని, అందుకు అతను ఆసుపత్రి వైద్యులపై మరియు వైద్య సిబ్బందిపై నానా దుర్భాషలాడుతూ, గొడవ చేశాడన్నారు.

ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదుచేయగా పోలీసులు వచ్చేటప్పటికి రోగితో పాటు రోగి బంధువులు వెళ్లిపోయారని తెలిపారు. ఆ తర్వాత రత్నం సోమయ్య సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులను చేస్తూ అసత్య ప్రచారాలను ఉద్దేశపూర్వకంగా ఆసుపత్రిని అప్రతిష్టపాలు చేస్తున్నాడని ఆవేదనవ్యక్తం చేశారు.

ఈ విషయంలో కొంతమంది కుట్రలు పన్ని ఆసుపత్రిని బదనాము చేసేందుకు పూనుకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులు విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

error: -