భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

స్థానిక పాల్వంచ పట్టణంలోని శ్రీవిద్య పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు అంబరాన్ని అంటాయి పాఠశాల ప్రాంగణాన్ని సర్వంగా సుందరంగా రంగవల్లులతో అందంగా అలంకరించారు.

పూజారికాలు నిర్వహించి కృష్ణుడి లీలా వేశాల ను అవతార విశిష్టతను పిల్లలకు చక్కగా వివరించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణుడు మరియు గోపికల వేషాధారణాలతో అలరించారు.

అనంతరం ఉట్టికొట్టే ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు పాఠశాల విద్యార్థులందరూ ఆటపాటలతో ఆనందంగా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పాఠశాల CEO చైతన్య , GM Y నరేష్, ప్రిన్సిపల్ డాక్టర్ వందనపు స్వప్న, ఏవో కృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినీలు, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

error: -