మంచిర్యాల జిల్లా
బెల్లంపల్లి
తేదీ:25 ఆగస్టు 2025
✍️ మనోజ్ కుమార్ పాండే

బెల్లంపల్లి: ఆదివారం మంచిర్యాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కరాటే టాలెంట్ హంట్ లో జెన్ షిటోరియో కరాటే స్కూల్ కి చెందిన బెల్లంపల్లి మైనార్టీ విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు.

కాటా వివిధ భాగాలలో వైష్ణవి, సుమయా బంగారు పతకాలు. చరణ్య , అన్విత, సిరి వెన్నెల వెండి పతకాలు. కరిష్మా, లీక్షదీశ్, సాధన, తేజశ్రీ, వినిత్య శ్రీ, దివ్య, ఆయేషా రాగి పతకాలు సాధించారు. ఫైట్ వివిధ భాగలలో కరిష్మా బంగారు పతకం. తమన్నా వెండి పతకం సాధించారని బెల్లంపల్లి మైనార్టీ హాస్టల్ ప్రిన్సిపాల్ ఎం.డి.నీలు తెలిపారు.

ఈ విద్యార్థులను తెలంగాణ జెన్ షిటోరియో కరాటే స్కూల్ చీఫ్ ఆవుల రాజనర్సు, మైనార్టీ స్కూల్ మాస్టర్ అంబాల శిరీష, జయప్రసాద్ లు వారిని అభినందించారు.

error: -