మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేది: 27 ఆగస్టు 2025
బెల్లపల్లి: పట్టణంలోని కోర్టు రోడ్డు వద్ద, దత్తాత్రేయ మెడికల్ ముందు ఒక వ్యక్తిపై హత్య ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలో రౌడీ షీటర్ను అరెస్ట్ చేసినట్లు బెల్లంపల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆగస్టు 26 వ తేది మధ్యాహ్నం నిందితుడు దత్తత్రేయ మెడికల్ షాపు లో పనిచేస్తున్న చొక్కాల సతీష్ అనే వ్యక్తిని బయటకి రమ్మని పిలిచి, అతని తో గొడవపడి బండ రాయితో తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు, అంతే కాకుండా క్రింద పడేసి గొంతు పై కాలు పెట్టి హత్యా యత్నం చేసాడు.
బాధితుడు భయంతో అక్కడి నుండి తప్పిచుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు, ఫిర్యాదు దారుడు గతంలో తన స్నేహితుడైన తిరుపతి కి 2 లక్షలు అప్పుగా ఇవ్వగా, అవి ఎందుకు తిరిగి అడుగు తున్నావని, మళ్ళీ అడిగితె చంపుతా అని భూతులు తిడుతూ తీవ్రంగా గాయపరిచి, హత్యా ప్రయత్నం చేశాడు.
పోలీసులు విచారణ చేపట్టి నిందితుడి కోసం గాలిస్తుండగ, నిందితుడిని బుధవారం బెల్లంపల్లి బస్టాప్ వద్ద పట్టుకున్నారు. నిందితుడు అఖిల్ ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు సీఐ తెలిపారు.
వారు మాట్లాడుతూ… నిందితుడిపై గతంలో బెల్లంపల్లి టూ టౌన్ మరియు ఇతర పోలీస్ స్టేషన్లలో 6 కేసులు నమోదైనట్టు తెలిపారు. ఈ సందర్భంగా
సంఘ విద్రోహ శక్తులను హెచ్చరిస్తూ, పట్టణంలో అసాంఘిక చర్యలకు పాల్పడిన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోవు వినాయక చవితిని ప్రశాంతముగా జరుపుకోవాలని ఎవరైనా శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకొని అవసరం అయితే పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని బెల్లంపల్లి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
- గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
