కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
తేదీ:27 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
కొమురంభీం-ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల ఒక పోలీస్ అధికారి హిందూ పండుగలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించడంపై హిందూ సంస్థలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి.
వినాయక నవరాత్రుల నిమజ్జనం సందర్భంగా రాత్రి పది దాటిన తరువాత స్పీకర్లు మోగిస్తే, భక్తి గీతాల కోసం స్పీకర్లు వాడితే తొక్కేస్తామని ఆ అధికారి మాట్లాడడం పట్ల హిందువుల భావోద్వేగాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు.
హిందూ సంస్థలు మాట్లాడుతూ.., ఎన్నో ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా జరుగుతున్నా, ఈ సంవత్సరం మాత్రమే ఇలాంటి ఆంక్షలు పెట్టడం అర్ధరహితమన్నారు. ఇతర మతాల పండుగల సమయంలో ఇలాంటి ఆంక్షలు ఉండవని, కేవలం హిందూ పండుగలపైనే ఎందుకు ఇలాంటి నియంత్రణలు అని ప్రశ్నించారు.
విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ ఉత్సవ కమిటీ నాయకులు సమాజం శాంతియుతంగా పండుగలు జరుపుకుంటుందని, ప్రభుత్వ యంత్రాంగం కూడా సహకరించాలని కోరారు. అధికారిని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని సూచించారు.
“జై శ్రీరామ్” నినాదాలతో హిందూ సమాజం ఐక్యంగా పండుగలను కొనసాగిస్తామని సంస్థలు స్పష్టం చేశాయి.
ఇవి కూడా చదవండి …
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
- గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
