మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:21 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ కే.శ్రీనివాస్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు కలిసి మెలసి భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని మండపం నిర్వాహకులు పోలీసు నిబంధనలను పాటించి ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు.

ఈ సన్మాన కార్యక్రమంలో బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి సదానందం, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ పాండే, కోశాధికారి కత్తుల నవీన్, కార్యవర్గ సభ్యులు ఎం.భాస్కర్, కే.రమేష్ తదితరులు పాల్గొన్నారు.

error: -