భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
చండ్రుగొండ మండలం
✍️దుర్గా ప్రసాద్
ఈ నెల 21 తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలం పరిధిలోని బెండాలపాడు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సోమవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఎం.ఎల్.ఏ లు జారె ఆదినారాయణ, మాలోత్ రాందాస్ నాయక్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి, తెల్లం వెంకట్ రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా SP రోహిత్ రాజ్ లు చండ్రుగొండలో ఇందిరమ్మ గృహప్రవేశం, సిఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బెండాలపాడులో సిఎం చే ప్రారంభించనున్న ఇందిరమ్మ గృహలను, పైలాన్ నిర్మాణపు పనులను, చండ్రుగొండలో జరిగే బహిరంగ సభ పనులను పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, DCCB డైరెక్టర్ తుళ్ళురి బ్రహ్మయ్య, కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ మురళి, వూగంటి గోపాల్ రావు, పాల్వంచ మాజీ ZPTC యర్రంశెట్టి ముత్తయ్య, పాల్వంచ, సుజాతనగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, చింతలపూడి రాజశేఖర్, వై. వెంకటేశ్వరరావు (రిటైర్డ్ ADE ) తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
