పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులను ఆపాలని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మణుగూరు లో భారీ ర్యాలీ.
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులు ఆపాలని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మణుగూరు తహసిల్దార్ కార్యాలయం నుండి పూల మార్కెట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
ఈ ప్రదర్శనలో పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులు ఆపాలని, ప్రపంచశాంతి వర్ధిల్లాలని, పాలస్తీనా ప్రజలను రక్షించాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ…
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ యూదులను ఊచకోత కోసి వేలాది మందిని చంపితే యూదులు తమ రక్షణ కోసం ఉండడానికి ఏ దేశం సహకరించకపోతే తల దాచుకోవడానికి యూదులకు పాలస్తీనాలో చోటిచ్చిన పాపానికి పాలస్తీనాలో ఇజ్రాయిల్ దేశం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పాలస్తీనాలో మెజారిటీ భూభాగాన్ని ఆక్రమించుకొని, కొద్దిపాటి భూభాగానికి పాలస్తీనాను పరిమితం చేయడమే కాకుండా పూర్తిగా పాలస్తీనా దేశాన్ని లేకుండా చేయాలనే దుర్బుద్ధితో స్కూల్ ల మీద, హాస్పిటల్ ల మీద బాంబులు వేస్తూ చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా మారణ హోమం సృష్టిస్తుందన్నారు.
వారికి ఆహారం, మందులు అందకుండా చేసి ఆకలి చావులకు ఇజ్రాయిల్ గురి చేస్తూ, పాలస్తీనా జాతి హననానికి పాల్పడుతుందన్నారు. ఇది దుర్మార్గమన్నారు. పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులు ఆపాలని, ప్రపంచ శాంతి కాపాడాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైవ్ (ప్రజాపందా) నాయకులు ముద్దా. బిక్షం, ఆర్. మధుసూదన్ రెడ్డి, మల్లెల. రామయ్య, టిడిపి నాయకులు వట్టం. నారాయణ, వై. పూర్ణచందర్ రావు, వాసిరెడ్డి. చలపతిరావు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఏ. చంద్రం, ఎం. నాగేశ్వరావు, ఎస్ డి. నాజర్ పాషా, సిపిఎం నాయకులు నెల్లూరు. నాగేశ్వరరావు, సత్తరపల్లి. సాంబశివరావు, నైనారపు. నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు గడ్డం. వెంకటేశ్వర్లు, రాయల. బిక్షం, సీతారాములు, కాంగ్రెస్ నాయకులు కూచిపూడి. బాబు, గుండ్ల వెంకటేశ్వర్లు (GV), ఎండి. రహీమ్ పాషా, బి ఆర్ ఎస్ నాయకులు యూసఫ్, జావీద్, హబీబ్, ముస్లిం మిల్లత్ కమిటీ నాయకులు ఎండి. ఇస్మాయిల్, ఎండి. సిరాజ్ పాషా, ఎండి ముస్తఫా, బీసీ సంఘం నాయకులు బుర్ర. సోమేశ్వర్ గౌడ్, పెనుగొండ. సాంబ శివరావు, బింగి. రమాదేవి, ఎమ్మార్పీఎస్ నాయకులు కొమ్ము.హుస్సేన్, కొండయ్య పి. కళ్యాణ్ బాబు, మాల మహానాడు నాయకులు వి. నరేష్, మెకానిక్ వర్కర్స్ యూనియన్ నాయకులు కే. బోస్, ఎస్ కే. బాబా, పి. సింహాచలం డిగ్రీ, జూనియర్ ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
- జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్షా సమావేశం
- ఈనెల 29న 1104 యూనియన్ తో యాజమాన్యం జాయింట్ మీటింగ్.
- PRTU శాశ్వత సభ్యత్వం… కుటుంబానికి భరోసా… – జయశ్రీ.
- మధర్ థెరిస్సా గారి 115వ జయంతి పురస్కరించుకుని కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విగ్రహమునకు పాలాభిషేకం
- ఏసిబి వలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
