భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచ టౌన్‌లోని దమ్మపేట సెంటర్‌లో, బీజేపీ పార్టీ జిల్లా నాయకులు పొనిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ శ్రీ మామిడిశెట్టి నారాయణ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
పొనిశెట్టి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
ప్రపంచంలో అగ్రశ్రేణి దేశాలతో సమానంగా దేశ రక్షణ వ్యవస్థను తీర్చిదిద్దిన ఘనత మోడీ గారిదేనని అన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలు, అనేక జాతీయ రహదారుల నిర్మాణం, అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేయడం, వందలాది సంక్షేమ పథకాలను అమలు చేయడం మోడీ గారి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు.
పాకిస్తాన్ ఉగ్రవాద మూకలను ఎదుర్కొనేందుకు ఆపరేషన్ సిందూర్ పేరుతో శత్రు దేశంలో ఉన్న ఉగ్ర స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసిన ఘనతను గుర్తుచేసి, దేశ భద్రత కోసం పనిచేస్తున్న భారత ఆర్మీకి వందనం తెలిపారు.
“సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ – సబ్ కా విశ్వాస్” నినాదంతో మోడీ గారు ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాలోత్ ప్రశాంత్ నాయక్, మాదారపు లక్ష్మణ్, లింగగిరి వెంకట్రామయ్య, సంతపల్లి గోపాల్, సొంద్ సాహెబ్, రామ్ చరణ్, కిట్టు, రాము, విజయ్, సురేష్, నరేష్, నరేందర్, వెంకటేష్, శ్రీను, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
