భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

స్థానిక పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్లో గల త్రివేణి పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు అంబరాన్నంటాయి. పాఠశాల ప్రాంగణాన్ని సర్వంగా సుందరంగా రంగవల్లులతో అందంగా అలంకరించారు.

పూజాదికాలు నిర్వహించి శ్రీకృష్ణుడి లీలా వేషాలను అవతార విశిష్టతను పిల్లలకు చక్కగా వివరించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణుడు మరియు గోపికల వేషధారణలతో అందరినీ అలరించారు.

అనంతరం ఉట్టి కొట్టే ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల విద్యార్థులందరూ ఆటపాటలతో ఆనందంగా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి గారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ఆ పరమాత్మ పలు అవతారములు ఎత్తి ఈ లోకము ను ఉద్ధరించాడని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల సి ఆర్ ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ గారు, ప్రిన్సిపల్ ఈ రామ్మూర్తి గారు కిట్స్ ఇంచార్జ్ జి.కవిత గారు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

error: -