మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:12 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని బూడిదిగడ్డ బస్తీలో బస్తీ వాసులు పాత ఇనుప పైపులతో, మూడు వరుసల సిమెంట్ ఇటుకలతో వినాయకుని మండపాన్ని నిర్మించారు. ఈ విషయంలో కొందరు పిర్యాదు చేశారని, మంగళవారం రెవిన్యూ, మున్సిపల్, పోలీసు సిబ్బంది మూకుమ్మడిగా జేసీబీ తో వినాయకుని మండపాన్ని కూల్చివేయడం కోసం వొచ్చారు.
దీన్ని బస్తీ మహిళలు తీవ్రంగా వ్యతిరేకించారు. పట్టణంలో పలుచోట్ల కోట్ల విలువగల భూములు ఆక్రమణలకు గురవ్వడం వారికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. బస్తీ మూలాన చెత్త కుప్పలను శుభ్రపరచుకొని వినాయకుని మండపం ఏర్పాటు చేసుకుంటే కూల్చివేతకు ఇంత మంది అధికారులు రావడం సమంజసమేనా అని ప్రశ్నించారు.
అది కేవలం వినాయకుని కోసం ఏర్పాటు చేసే మండపమని అది ఎల్లప్పటికీ వినాయకుని కోసమే ఉంటుందని తేల్చిచెప్పారు. దీని విషయమై తహసీల్దార్ కృష్ణను వివరణ అడగ్గా ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం షెడ్డు తీసివేయడానికి 7 రోజులు సమయం ఇచ్చామని, ఎట్టి పరిస్థితుల్లో షెడ్డు తొలగించాలని బస్తీ ప్రజల ద్వారా లిఖిత పూర్వకంగా పత్రం తీసుకోవడమైనదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణ,వన్ టౌన్ ఎస్.హెచ్.ఓ. కే.శ్రీనివాస్,ఆర్.ఐ లు,ఎస్.ఐ లు పోలీసు సిబ్బంది, ఎస్.ఎన్.సీ.సీ.సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
