మంచిర్యాల జిల్లా,
జైపూర్,
తేదీ:12 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

జైపూర్: గతనెల 25వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రావణి చికిత్స కోసం జిల్లాలో గల ప్రభుత్వ ఉద్యోగులు తమ వంతు ఆర్థిక సహాయం అందించి తమ ఉదారతను చాటుకున్నారు.

మంగళవారం రోజున శ్రావణిని వారి స్వగృహంలో పరామర్శించిన సందర్భంగా, జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వర్ రావు, పే బ్యాక్ సొసైటీ సభ్యులను కొనియాడారు. ఇదే సందర్భంగా పే బ్యాక్ సొసైటీ, మంచిర్యాల జిల్లా వ్యవస్థాపకులు దాసరి వెంకట రమణ, జాడి రామ్ కుమార్ మాట్లాడుతూ, ఆపద సమయంలో శ్రావణి చికిత్స కోసం మద్దతుగా నిలిచిన జిల్లాలోని ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఎంతో మంది ఉద్యోగులు తమ దాతృత్వం చాటారని, వారి ఆర్థిక సహాయం వల్లనే శ్రావణి తగిన సమయంలో మంచి చికిత్స పొందగలిగారని వారి సహాయం మరువలేనిదని చెప్పారు. ఈ దాతృత్వ కార్యక్రమంలో జిల్లాలోని ఉద్యోగులు శాఖలకు అతీతంగా స్పందించారని, వేరే జిల్లాల్లో పని చేస్తున్న ఉద్యోగులు సైతం ముందుకు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు.

ఇక ముందు కూడా మంచిర్యాల జిల్లాలో పని చేస్తున్న ఏ ఉద్యోగికి అయినా సరే ఆపద వచ్చినప్పుడు పే బ్యాక్ సొసైటీ ఖచ్చితంగా అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జైపూర్ మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపు రావ్ మాట్లాడుతూ, శ్రావణికి అండగా నిలిచిన పే బ్యాక్ సొసైటీని మరియు మద్దతుగా నిలిచిన ఉద్యోగులందరిని అభినందించారు.

ఈ సందర్భంగా శ్రావణి కుటుంబ సభ్యులకు శ్రావణి ఆరోగ్యం గురించిన జాగ్రత్తలు చెప్పి జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వర్ రావ్ చేతుల మీదుగా పండ్లను అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ దాసరి నరేందర్, పంచాయతీ కార్యదర్శులు సుమన్, సాయి మరియు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

error: -