పాల్వంచలో కొత్వాల ఆధ్వర్యంలో రాజీవ్ కు నివాళులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

భారతదేశాన్ని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ. రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల పాల్వంచలో కొత్వాల ఆధ్వర్యంలో రాజీవ్ కు నివాళులు అర్పించారు.

టెక్నాలజీ రంగంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు కొనియాడారు.

దేశ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం పాల్వంచలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక రాజీవ్ కూరగాయల మార్కెట్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి కొత్వాల తో పాటు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ అమర్ హై సోనియా గాంధీ రాహుల్ గాంధీల నాయకత్వం వర్ధిల్లాలి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ… దేశ సమైక్యత సమగ్రతల కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు బలిదానం అయ్యారన్నారు. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ కార్యకర్తలు మతసామరస్యాన్ని కాపాడాలన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు కంకణబద్దులు కావాలని కొత్వాల అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, INTUC జిల్లా అధ్యక్షులు ఎస్ఏ జలీల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, కాంగ్రెస్ నాయకులు మహిమతి రామలింగం, కాల్వ భాస్కర్ రావు, గంగిరెడ్డి భువనసుందర్ రెడ్డి, కాపర్తి వెంకటాచారి, కందుకూరి రాము, ఉండేటి శాంతి వర్ధన్, అలెక్స్, వాసుమల్ల సుందర్రావు, షేక్ చాంద్ పాషా, డిష్ నాగేశ్వరరావు, నల్లమల సత్యం, బత్తుల వెంకటేశ్వరరావు, సందు ప్రభాకర్, ధర్మసోత్ ఉపేందర్ నాయక్, మస్నా శ్రీనివాస్, కటుకూరు శేఖర్, భూక్య గిరిప్రసాద్, జగన్నాథం అజిత్, చింతలచెరువు రమేష్, వాసుమల్ల సోమయ్య, ఎర్రగుంట నరసింహారావు, G.ప్రభాకర్, కూరగాయల యూనియన్ నాయకులు కృష్ణవేణి, సత్యనారాయణ, శివ, భవానీ ప్రసాద్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

error: -