మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:12 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లి ఆలయం లో పూజలు, అభిషేకాలు చేయడం పట్ల బెల్లంపల్లి పట్టణ విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులను అకారణంగా అరెస్టు చేయడం అన్యాయమని హిందూ సంఘాల నాయకులు మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అనాలోచిత నిర్ణయాలను మానుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిరసనలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.

అరెస్టు అయిన వారిలో జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు రేవెళ్లి రాజలింగు, జిల్లా భజరంగ్ సహ సంయోజక్ ఐమూడి మురళీ మనోహర్, కంచి వేణు, పెట్టెం అశోక్, సిరికొండ మోహన్, దాసరి సతీష్, నితిన్ రాజు, సుజన్ కుమార్, శ్రీకాంత్, విలాస్ గౌడ్ ఉన్నారు. వారిని అరెస్టు చేసి తదుపరి సొంత పూచీకత్తుపై విడిచి పెట్టారు.

error: -