మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:19 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పట్టణ, మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నూతన అధ్యక్షులుగా అక్కెనపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా జన్నం సత్యనారాయణ, కోశాధికారిగా శ్రీరామోజు లక్ష్మణాచారీ లను ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు.

బెల్లంపల్లి మండల విశ్వబ్రాహ్మణ సంఘం కన్వీనర్ మడుపు రవికుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. వారి ఆధ్వర్యంలో మిగతా కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకున్నామని తెలిపారు.

ఈనెల 20 వ తేదీన సాయంత్రం 4 గంటలకు స్థానిక హనుమాన్ మందిర్ లో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ మహాసభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు ప్రముఖులు హాజరవుతారన్నారు. కావున ఈ సభకు నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ సంఘీయులు, మండల గ్రామాల విశ్వ బ్రాహ్మణ కులస్థులు అందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరారు.

error: -