విప్ప లడ్డూ కావాలా నాయనా…
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
భద్రాచలం
✍️దుర్గా ప్రసాద్
భద్రాచలం ఏజెన్సీ అటవీప్రాంతంలో అటవీఉత్పత్తులు సేకరించి జీవనం సాగించడమే కాకుండా విస్తారంగా లభించే విప్పపువ్వుతో లడ్డూలు, చాక్లెట్లు తయారు చేస్తున్నారు ఆదివాసీ మహిళలు. చర్ల మండలం సున్నంగుంపు గ్రామానికి చెందిన శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటి గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న విప్ప లడ్డూల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు ఐటీడీఏ పీవో రాహుల్.
అడవుల్లో సహజసిద్ధంగా లభించే విప్పపువ్వులో డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి లడ్డూలు, ఔషధ గుణాలున్న వనమూలికలతో కారంపొడి, పచ్చళ్ళు తయారు చేసి విక్రయిస్తూ స్వశక్తితో చిన్న తరహా పరిశ్రమ నెలకొల్పి జీవనోపాధి పొందుతున్న ఆదివాసి మహిళలను పీవో రాహుల్ అభినందించారు.
ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ కు బ్రాండింగ్, ప్యాకింగ్ కు కావాల్సిన మిషనరీని ఐటీడీఏ ద్వారా అందించి మరింత అభివృద్ధి అయ్యేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి….
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
- జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్షా సమావేశం
- ఈనెల 29న 1104 యూనియన్ తో యాజమాన్యం జాయింట్ మీటింగ్.
- PRTU శాశ్వత సభ్యత్వం… కుటుంబానికి భరోసా… – జయశ్రీ.
- మధర్ థెరిస్సా గారి 115వ జయంతి పురస్కరించుకుని కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విగ్రహమునకు పాలాభిషేకం
- ఏసిబి వలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
