భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
కేంద్రంలోని BJP ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండకట్టాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ తోపాటు CPI, CPM, CPI ML, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి, ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ల దిష్టిబొమ్మను తగలబెట్టారు
పాల్వంచ అంబేద్కర్ సెంటర్ లో దిష్టిబొమ్మల దహనం అనంతరం కొత్వాల మాట్లాడుతూ దేశంలోని రైతాంగం, కార్మిక రంగాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు కేంద్రం గురిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన 42% BCల రిజర్వేషన్ బిల్లును ఆమోదం కాకుండా కేంద్రం అడ్డుపడుతుందన్నారు.
గత ఎన్నికల్లో అధికారం చేపట్టడం కోసం BJP అనేక అడ్డదారులు తొక్కి, EVM ల టాంపరింగ్ ను ప్రోత్సహించిందని, ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసిన కాంగ్రెస్, మిత్రపక్షాల MP లను అక్రమంగా అరెస్టులకు గురిచేస్తున్నదన్నారు. దేశంలోని ప్రజాస్వామ్య వాదులందరూ మోడీ ప్రభుత్వం గద్దెదిగే వరకూ ప్రజలను చైతన్యవంతులను చేయాలని కొత్వాల కోరారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, LDM కోఆర్డినేటర్ బద్ది కిషొర్, CPI నాయకులు అడుసుమిల్లి సాయిబాబు, వీసంశెట్టి పూర్ణచందర్ రావు, ఉప్పుశెట్టి రాహుల్, CPM నాయకులు దొడ్డా రవి, సత్య, కొండబోయిన వెంకన్న, CPI (ML) న్యూ డెమోక్రసీ నాయకులు గౌని నాగేశ్వరరావు, K వెంకటేశ్వర్లు, CPI (ML) మాస్ లైన్ నాయకులు కట్లూరి కిషొర్, రాయబారపు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు SVRK ఆచార్యులు, కాల్వ భాస్కరరావు, కాపర్తి వెంకటాచారి, గంగిరెడ్డి భువనసుందర్ రెడ్డి, వాసుమల్ల సుందర్ రావు, ధర్మసోత్ ఉపేందర్ నాయక్, డిష్ నాగేశ్వరరావు, షేక్ చాంద్ పాషా, దారా చిరంజీవి, ఉండేటి శాంతివర్ధన్, శ్రీలతా రెడ్డి, గంధం నర్సింహారావు, బొశెట్టి సాంబయ్య, ఓలపల్లి రాంబాబు, కటుకూరి శేఖర్, పాకలపాటి రోశయ్య చౌదరి, GV రత్నం, అశోక్, యమ్మన మల్లిఖార్జున్, పారిపట్టి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
