ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

నేటి పంచాంగం

విక్రమ సంవత్సరం: 2080 నల

శక సంవత్సరం: 1945 శోభకృత్

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: శిశిర

మాసం: మాఘ

పక్షం: కృష్ణ – బహుళ

తిథి: తదియ రా.11:40 వరకు
తదుపరి చవితి

వారం: మంగళవారం – భౌమవాసరే

నక్షత్రం: హస్త రా.తె.05:23 వరకు
తదుపరి చిత్ర

యోగం: శూల సా.04:25 వరకు
తదుపరి దండ

కరణం: వణిజ ఉ‌.10:43 వరకు
తదుపరి భధ్ర రా.11:40 వరకు
తదుపరి బవ

వర్జ్యం: ప‌.12:14 – 02:00 వరకు

దుర్ముహూర్తం: ఉ‌‌.08:57 – 09:45
మరియు రా. 11:12 – 12:04

రాహు కాలం: ప‌.03:25 – 04:53

గుళిక కాలం: ప‌.12:29 – 01:57

యమ గండం: ఉ‌.09:32 – 11:01

అభిజిత్: 12:05 – 12:51

సూర్యోదయం: 06:36

సూర్యాస్తమయం: 06:21

చంద్రోదయం: రా.08:39

చంద్రాస్తమయం: ఉ‌.08:11

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: కన్య

దిశ శూల: ఉత్తరం

సంత్ నరహరి సోనార్మ హారాజ్ పుణ్యతిథి‌

శృంగేరి శారదాంబ. రథోత్సవము

కోయంబత్తూర్ శ్రీ కొనియమ్మన్తి రుకల్యాణం‌

శ్రీ లోకనాథతీర్థ స్వామి‌ పుణ్యతిథి‌

బెల్గాం‌ మాయక్కాదేవి‌ జాతర‌

ఎరిపాద నాయనార్తి రునక్షత్రం

శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ స్మృతి దినం

నేటి రాశి ఫలాలు

మేషం

సర్వత్రా విజయసిద్ధి కలదు. ఊహించిన దాని కన్నా గొప్ప ఫలితాలను పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త శక్తిని ఇస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ నామస్మరణ శుభప్రదం.

వృషభం

ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ మీ రంగాల్లో నియమాలను పాటిస్తూ ముందుకు సాగండి, మంచి ఫలితాలు సొంతం అవుతాయి. అతిగా ఎవరినీ నమ్మకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

మిధునం

ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. చతుర్థ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. నారాయణ మంత్రాన్ని జపించాలి.

కర్కాటకం

సౌభాగ్యసిద్ధి ఉంది. స్థిరనిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. భోజనసౌఖ్యం ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. శ్రీవేంకటేశ్వరుని ఆరాధన శుభప్రదం.

సింహం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించే మార్గాలను వెతకాలి. బంధు, మిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

కన్య

కార్యసిద్ధి ఉంది. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇష్టదైవ ప్రార్ధన చేయడం ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.

తుల

మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

వృశ్చికం

కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. ఇష్టకార్యసిద్ధి ఉంది. ఆర్థికలావాదేవీలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. గురుచరిత్ర పారాయణ శుభప్రదం.

ధనుస్సు

ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు. ఇష్టమైన వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.

మకరం

జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం. ఆపద, కష్టాలు ఎదురవుతాయి. ఒక వార్త మనోవిచారాన్ని కలిగిస్తుంది. కలహ సూచన. ఆవేశాలకు పోకూడదు. శ్రమ అధికం అవుతుంది. లింగాష్టకం చదవడం వల్ల పనులలో విజయంతో పాటు మంచి జరుగుతుంది.

కుంభం

మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నవగ్రహ ధ్యానం వల్ల మేలు జరుగుతుంది.

మీనం

గ్రహబలం అనుకూలిస్తోంది. దైవబలంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభం పొందుతారు. శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)