అమెరికా నుంచి చైనాకు అత్యాధునిక కంప్యూటర్ చిప్లను ఎగుమతి చేసే విషయంలో కీలక ముందుడుగు పడింది. చైనాలో విక్రయాలపై తమకు వచ్చే లాభాల్లో ట్రంప్ సర్కారుకు వాటా చెల్లించేందుకు అమెరికన్ చిప్ కంపెనీలైన ఎన్విడియా, ఏఎండీ అంగీకరించాయి.

భద్రతా కారణాలను చూపుతూ చిప్ ఎగుమతులను అమెరికా నిలిపివేయగా… ప్రతిగా చైనా అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో లాభాల్లో వాటా తీసుకుని చిప్ల ఎగుమతికి అమెరికా ప్రభుత్వం అంగీకరించడం గమనార్హం.

error: -