అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా అమెరికాలోని కుటుంబాలపై గణనీయమైన ఆర్థిక భారం పడనుంది.
ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఏటా అదనంగా $2,400 (సుమారు ₹2 లక్షలు) భారం పడనున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ టారిఫ్లు దిగుమతుల ధరలను పెంచి, అది చివరికి వినియోగదారులకు చేరడం వల్ల ఈ భారం పడుతుందని నివేదిక పేర్కొంది.
