localnewsvibe

సంఘటనలు

1807: అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది.

1836: టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ కు మెక్సికో దేశం నుండి స్వతంత్రం లభించింది.

1943: రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా బిస్మార్క్ సముద్రంలో యుద్ధం.

1956: మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం లభించింది.

2008: కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ లో భారత్ విజేతగా నిలిచింది.

2011: శివరాత్రి ; కోటిపల్లి తీర్థం.

జననాలు

1935: దుద్దిల్ల శ్రీపాద రావు, శాసనసభ్యుడు, శాసనసభ స్పీకరు. (మ.1999)

1936: అబ్బూరి గోపాలకృష్ణ, బహుముఖ ప్రజ్ఞాశాలి. (మ. 2017)

1962: యాకూబ్, కవి, అంతర్జాలంలో బహుళ ప్రాచుర్యం పొందుతున్న తెలుగు కవిత్వ వేదిక కవిసంగమంను ప్రారంభించి నిర్వహిస్తున్నారు.

1963: విద్యాసాగర్, సంగీత దర్శకుడు.

1977: ఆండ్రూ స్ట్రాస్‌, ఇంగ్లిష్‌ క్రికెటర్‌. ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుకు నాయకుడు. ఎడమచేతి వాటం ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌.

మరణాలు

1938: వడ్డాది సుబ్బారాయుడు, తొలి తెలుగు నాటకకర్త. (జ.1854)

1949: సరోజిని నాయుడు, భారత కోకిల.

1990: మసూమా బేగం, సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు. (జ.1901)

2014: టి.వి.కె.శాస్త్రి, అనంతరం కళాసాగర్ సంస్థలో పనిచేస్తుండగా సంగీత విద్వాంసులు, కళాకారులు, రాజకీయ, సినీరంగ ప్రముఖులతో సంబంధాలు ఏర్పడ్డాయి.

2015: పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్‌ స్థాపకుడు. ఆఫ్‌సెట్‌ ముద్రణాయంత్రం కంప్యూటర్‌ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (జ. 1924)