ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: మాఘ
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: సప్తమి రా.తె.03:59 వరకు తదుపరి అష్టమి
వారం: శనివారం – మందవాసరే
నక్షత్రం: విశాఖ ఉ.10:52 వరకు తదుపరి అనూరాధ
యోగం: వ్యాఘత సా.06:07 వరకు తదుపరి హర్షణ
కరణం: భధ్ర ప.03:48 వరకు తదుపరి బవ రా.తె.03:59 వరకు తదుపరి బాలవ
వర్జ్యం: ప.02:59 – 04:38 వరకు
దుర్ముహూర్తం: ఉ.06:33 – 08:03
రాహు కాలం: ఉ.09:30 – 10:59
గుళిక కాలం: ఉ.06:33 – 08:02
యమ గండం: ప.01:56 – 03:25
అభిజిత్: 12:05 – 12:51
సూర్యోదయం: 06:33
సూర్యాస్తమయం: 06:22
చంద్రోదయం: రా.12:03
చంద్రాస్తమయం: ఉ.10:32
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: తుల
దిశ శూల: తూర్పు
త్రిపుష్కరయోగము
త్రిస్రోష్టకాః
పూర్వేద్యుశ్రాద్దము
సర్వాప్తి సప్తమి వ్రతం
శబరి జయన్తీ
నిక్షుభార్క సప్తమి
శ్రీ గజానన్ మహారాజ్ ప్రకటన దినం
కంచోడు శ్రీ మంజునాథేశ్వర ఉత్సవారంభం
నేటి రాశి ఫలాలు
మేషం
శుభ కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్యమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం ద్వారా లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు . ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది.
వృషభం
కీలక వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. సూర్యాష్టకం చదివితే మంచిది.
మిధునం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. శివ శ్లోకం చదవండి.
కర్కాటకం
ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పక విజయం సిద్ధిస్తుంది. చేసే పనిలో తడబాటు రానీయకండి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. కలహసూచన ఉంది. ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు. దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే శుభదాయకం.
సింహం
తలపెట్టిన పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలను పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. విష్ణు నామస్మరణ ఉత్తమ ఫలితాలనిస్తుంది.
కన్య
మధ్యమ ఫలితాలున్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.
తుల
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. మీరు ఊహించిన దానికంటే అధికంగా ధన లాభం పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనుల్లో ముందడుగు పడుతుంది. శత్రువుల మీద మీరే విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.
వృశ్చికం
ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పక విజయం సిద్ధిస్తుంది. చేసే పనిలో తడబాటు రానీయకండి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. కలహసూచన ఉంది. ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు. దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది.
ధనుస్సు
పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ స్తోత్రాన్ని చదివితే శుభదాయకం.
మకరం
బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివ నామస్మరణ మేలు చేస్తుంది.
కుంభం
శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రణాళికతో ముందుకు సాగి అనుకున్న పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
మీనం
మధ్యమ ఫలితాలున్నాయి. బంధుమిత్రులను కలుపుకొనిపోవడం ద్వారా ఇబ్బందులను అధిగమించగలుగుతారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్లడం మంచిది. అనవసరమైన ఆందోళన తగ్గించుకోవాలి. దుర్గ స్తోత్రం పఠించాలి.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)