ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: మాఘ
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: నవమి రా.03:04 వరకు
తదుపరి దశమి
వారం: సోమవారం – ఇందువాసరే
నక్షత్రం: జ్యేష్ఠ ఉ.11:52 వరకు
తదుపరి మూల
యోగం: వజ్ర సా.04:07 వరకు
తదుపరి సిద్ధి
కరణం: తైతుల ప.03:26 వరకు
తదుపరి గరజ రా.03:04 వరకు
తదుపరి వణిజ
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.12:51 – 01:39
మరియు ప.03:13 – 04:01
రాహు కాలం: ఉ.08:01 – 09:30
గుళిక కాలం: ప.01:56 – 03:25
యమ గండం: ఉ.10:58 – 12:27
అభిజిత్: 12:04 – 12:50
సూర్యోదయం: 06:32
సూర్యాస్తమయం: 06:23
చంద్రోదయం: రా.01:01
చంద్రాస్తమయం: ప.12:10
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
దిశ శూల: తూర్పు
నక్షత్ర శూల: తూర్పు
రామదాస్ నవమి
పూర్వాభాద్ర కార్తె
స్వామి సమర్ధ రామదాసు పుణ్యతిథి
అన్వాష్టకా శ్రాద్ధము
శాండిల్యఋషి జయన్తి ఉత్సవం
నేటి రాశి ఫలాలు
మేషం
ముఖ్యవిషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. శత్రువుల జోలికి పోకుండా ఉండటం మంచిది. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చంద్రధ్యానం శుభప్రదం.
వృషభం
ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కార మార్గం దొరుకుతుంది. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. కుటుంబసభ్యుల సలహాలు బాగా ఉపకరిస్తాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. ఈశ్వరారాధన శుభప్రదం.
మిధునం
పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. అర్ధలాభం ఉంది. కీలక విషయాల్లో సొంతనిర్ణయాలు లాభాన్నిస్తాయి. అభివృద్ధికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.
కర్కాటకం
చంచల స్వభావం వల్ల ఆటంకాలు పెరుగుతాయి. చేయని పొరపాటుకు నిందపడాల్సివస్తుంది. అభివృద్ధికై మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. దుర్గారాధన మంచినిస్తుంది.
సింహం
మంచి మనస్సుతో చేసే పనులు విశేష ఫలాన్నిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
కన్య
బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. కుటుంబ చిక్కులు ఇబ్బంది పెడతాయి. ఋణ సమస్యలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది.
తుల
మనస్సౌఖ్యం ఉంది. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనశాంతి లోపించకుండా జాగ్రత్తపడండి. వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
వృశ్చికం
ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. బలమైన ప్రయత్నంతో అనుకున్నది సాధిస్తారు. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రీ రామ నామస్మరణ మేలు చేస్తుంది.
ధనుస్సు
ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు తప్పకపోవచ్చును. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. దుర్గామాత శ్లోకాలను చదువుకోవడం మంచిది.
మకరం
మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. ముఖ్యమైన సమయంలో సహాయం అందుతుంది. బాధ్యతలను గుర్తెరిగి పనిచేయండి చక్కటి శుభఫలితాలను పొందుతారు. శ్రీ విష్ణు సందర్శనం ఉత్తమం.
కుంభం
మంచిపనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్నిస్తాయి. గోవింద నామాలు పఠించడం మంచిది.
మీనం
ధర్మసిద్ధి ఉన్నది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థలాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సమర్థవంతంగా వాటిని ఎదుర్కొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. సూర్య ధ్యానం శుభప్రదం.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)